|
కందుకూరి వీరేశలింగం రాజమహేంద్రవరంలో 16, ఏప్రిల్ 1848 నాడు సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించారు. వారి తాతగారి పేరుకూడా వీరేశలింగమే. తాతపేరును మనవడికి పెట్టారు. తాత వీరేశలింగం గారు కూడా సంఘసంస్కరాణాభిలాషి ఆయన శైవుడై వుండీ వైష్ణవుల అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. వీరేశలింగం తండ్రి వారి బాల్యంలో మరణించారు. తల్లి పెంపకంలో పెదనాన్న వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో పెరిగారు. |