|
బ్రిటన్‌లో ఓ అమ్మడి 'బ్రా'ను సురక్షిత స్థావరంగా భావించి, ఓ గబ్బిలం అక్కడే సుమారు ఐదు గంటల పాటు గుండెల మాటున దాగిన గబ్బిలాన్ని మొబైల్ ఫోన్ గా భావించింది హకిన్స్ అనే యువతి.
నార్విన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న హోటల్లో రిసెప్షనిష్టుగా పనిచేసే అబ్బీ హకిన్స్ విధులు నిర్వర్తిస్తుండగా ఆమె సెల్‌ఫోన్ నుంచి వైబ్రేషన్స్ సంకేతాలు లాంటివి రావడం గమనించింది. ఎంతసేపటికీ మొబైల్ ధ్వనులు ఆగకపోవడంతో ఆమె దుస్తులు విప్పి పరిశీలించడంతో లోగుట్టు బయటపడింది. దీనితో ఒక్క క్షణం ఆమె గుండె ఆగినంత పని అయింది. తరువాత తేరుకుని ఆ గబ్బిలాన్ని హోటల్ ఎదురుగా ఉన్న తోటలో వదిలేసింది. |