గూగుల్ సెర్చ్ ఇంజన్ కు పోటీగా మరో సెర్చ్ ఇంజన్ అందుబాటులోకి వచ్చింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసిన ఇంజనీర్లు అన్నా పీటర్సన్, ఆమె భర్త టామ్ పోస్టీతో, మరో ఇద్దరు ఇంజనీర్లతో కలిసి సోమవారం www.cuil.com(ఉచ్ఛారణలో 'కూల్')నుప్రారంభించారు.
ఈ సరికొత్త సెర్చ్ ఇంజన్ ను గూగూల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందించినట్లు వారు తెలిపారు. మొత్తం 120 బిలియన్ వెబ్‌సైట్ పేజీలను ఇండెక్సింగ్ చేసినట్లు వివరించారు. అయితే cuil ప్రారంభించిన కొంతసేపటికే సరైన ఫలితాలను ఇవ్వకపోవడం వారికి నిరాశపరిచింది. గూగుల్ కంటే మూడు రెట్లు, మైక్రోఫాస్ట్ కంటే పదిరెట్లు ఇండెక్సింగ్ సామర్ధ్యం ఉన్న ఈ cuil వీటికి ధీటుగా నిలబడలేకపోయింది. cuil సభ్యులంతా గూగుల్ ఇంజనీర్లుగా పనిచేసిన వారే. అన్నా పీటర్సన్ 2006లో గూగుల్ నుండి బయటకు వచ్చేసింది. |