|
ఐఫోన్‌కు ధీటుగా నోకియా ఎన్-96 |
|
|
మొబైల్ రంగంలోనే అద్భుతంగా భావిస్తున్న యాపిల్ సంస్థ ఐఫోన్ మన దేశ మార్కెట్‌లో ఇంకా విడుదల కాకముందే అతిపెద్ద మొబైల్ తయారీ సంస్థ అయిన నోకియా ఐఫోన్‌కు ధీటుగా ఉండే ఎన్- 96 పేరుతో కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
యాపిల్, నోకియా రెండు కూడా తమ ఫోన్ల ధర ఎంతో ఇంకా ప్రకటించలేదు కానీ 3డి సాంకేతిక పరిజ్ఞానం ఉండే ఈ రెండు ఫోన్లు కూడా దాదాపు ఒకే ధరలో ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. మన దేశంలో భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఎస్సార్లు ఐఫొన్లను అందిస్తూ ఉన్నందున ఇందులో ఓ భారతీయ విడిభాగం కూడా ఉంటుంది. 8 జిబి సామర్ధ్యం ఉండే ఐఫోన్ ధర మన దేశంలో దాదాపు 31వేల రూపాయలు ఉండవచ్చని వచ్చే నెలలో మార్కెట్‌లో అందుబాటులో రానున్న ఎన్-96 ఫోన్ ధర కూడా 30వేల రూపాయలపైనే ఉండవచ్చునని భావిస్తున్నారు. |