|
రెజ్లింగ్‌లో భారత్‌కు కాంస్యం |
|
|
బీజింగ్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ సుషీల్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించాడు. 66కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో ఈ పతకాన్ని సాధించాడు. 1952 ఒలింపిక్స్ తర్వాత రెజ్లింగ్‌లో ఇప్పుడు మరో పతకం భారత్‌కు లభించింది. ఇన్నేళ్ల తర్వాత...
భారత్‌కు రెజ్లింగ్‌లో పతకం లభించటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పతకంతో ఒలింపిక్స్‌లో భారత్ రెండు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. |