www.eenaduandhra.com - 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
3 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం Print E-mail
Jaheer Khanఈ రోజు దంబుల్లాలో శ్రీలంక, భారత్‌ల మధ్య జరిగిన  రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లలో ఇరు జట్ల బౌలర్ల హవా కొనసాగింది. తొలుత భారత్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రారంభించిన...
 
శ్రీలంక 38.3 ఓవర్లలో 142పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్లలో తుషార 42, కులశేఖర 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో పేసర్ జహీర్ ఖాన్ 4వికెట్లు, ప్రవీణ్ కుమార్ 3 వికెట్లు, హర్భజన్ సింగ్ 2వికెట్లు, ఇర్ఫాన్ పఠాన్ 1వికెట్ పడగొట్టారు. అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 39.4ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
 
Indian Team
 
భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లి 37, యువరాజ్ సింగ్ 20, ధోని 39, బద్రినాధ్ 27 (నాటౌట్) పరుగులు చేశారు. తొలి వన్డే ఆడుతున్న బద్రినాధ్ బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో తుషారా 2వికెట్లు, మెండిస్ 2వికెట్లు, ఫెర్నాండో 1వికెట్, కులశేఖర 2వికెట్లు పడగొట్టారు. 4వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జహీర్‌ఖాన్‌కు "మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్" లభించింది.