|
త్వరలో కండోమ్... కండోమ్ రింగ్‌టోన్ |
|
|
|
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సెల్‌ఫోన్ రోంగ్‌టోన్ గా కండోమ్ ... కండోమ్ అనే పదాల్ని ప్రవేశపెట్టనున్నారు. కండోమ్ పదాన్ని ఉచ్చరించేందుకు...
బహిరంగంగా కొనుగోలు చేసేందుకు ప్రజలలో ఉన్న భయాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని బీబీసి వరల్డ్ సర్వీస్ ట్రస్ట్ తయారుచేసింది. ఈ కార్యక్రమానికి బిల్ గేట్స్ సంస్థ 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' ఆర్ధిక సహాయాన్ని సమకూర్చింది. ఈ ప్రచారం ద్వారా జనంలో కండోమ్ పట్ల ఉన్న సంశయాన్ని రూపుమాపాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్.ఏ.సి.ఓ) భావిస్తోంది. ఈ రింగ్‌టోన్ ను WWW.CONDOM.ORG వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. |