www.eenaduandhra.com - హింసాకాండ కొనసాగితే నానో కారు ప్రాజెక్టు మూసివేస్తాం: రతన్ టాటా

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
హింసాకాండ కొనసాగితే నానో కారు ప్రాజెక్టు మూసివేస్తాం: రతన్ టాటా Print E-mail
Article Index
హింసాకాండ కొనసాగితే నానో కారు ప్రాజెక్టు మూసివేస్తాం: రతన్ టాటా
Page 2
Ratan TaTaపశ్చిమ బెంగాల్ సింగూరులో హింసాకాండ ఇదేవిధంగా కొనసాగినట్లయితే నానో కారు ప్రాజెక్టును మూసివేస్తామని రతన్‌టాటా హెచ్చరించారు. కర్మాగార స్థల ప్రదేశం నుండి విడిభాగాల యూనిట్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని తృణమూల్ కాంగ్రెస్ చేసిన...
 
డిమాండ్‌ను టాటా తిరస్కరించారు. 'ఇలా అయితే ఇక్కడ ఉండలేం, మాకు భద్రత లేదు, ఇక్కడ మేం పరిశ్రమ నిర్వహించాలో వద్దో బెంగాల్ ప్రజలే నిర్ణయించుకోవాలి, వారికే నిర్ణయాన్ని వదిలివేశాం, తమ పరిశ్రమ ఇక్కడ ఉండాలని పశ్చిమ బెంగాల్, కోల్‌కతా ప్రజలు కోరుకుంటే మంచిదే అని' ఆయన అన్నారు. మేం అక్కడలేదని అనుకుంటున్నారా ? లేక ఒక మంచి కార్పొరేట్ పౌరులుగా మమ్మల్ని సమ్మతిస్తున్నారో ? తేల్చుకోవాలని కోరారు. మీరు వద్దనుకుంటే మా ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టినాసరే, ఇక్కడి నుండి వెళ్ళిపోతామని అన్నారు.