ఇండోనేషియాకు చెందిన డేడే (37)ను చూస్తే తెలుస్తుంది. టీనేజీలో ఉండగా జన్యులోపాల వల్ల ఓ విచిత్రమైన వ్యాధి బారిన పడ్డాడు. దానితో ఒళ్ళంతా విచిత్రాకృతిలో బుడిపెలు లేచాయి. క్రమంగా కాళ్ళు, చేతులపై చెట్ల వంటి ఆకృతులుగా గూడు కట్టి అతని బతుకును...
దుర్భరం చేశాయి. కదల్లేని స్థితికి చేరుకోవడంతో భార్య, బిడ్డలు దూరమయ్యారు. బాండూంగ్ హాస్పిటల్ వైద్యులు తొమ్మిది ఆపరేషన్లు ద్వారా వీటిని దాదాపుగా తొలగించి అతనికి పూర్వపు ఆకృతి కల్పించారు. ఇంకా మిగిలిన మరో 300గ్రాముల బుడిపెను రెండు నెలల తర్వాత పూర్తిగా తొలగిస్తాం. ఈ లోగా అవి మళ్ళీ పెరగకుండా శక్తివంతమైన మందులు, విటమిన్ ఏ వంటివి ఇచ్చాం అని వైద్యులు తెలిపారు. |