రాజు మద్దతుదారుల ఆందోళానతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరం అట్టుడికిపోయింది. ప్రధాని, మంత్రుల కార్యాలయాలను, పోలీస్ కేంద్ర కార్యాలయాన్ని దాదాపు పాతికవేళ మంది ఆందోళనకారులు ముట్టడించారు. ప్రధాని సమక్ సుందరవెజ్ ను...
గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. సమక్ కూడా మాటలతో ఎదురుదాడికి దిగారు. ఆందోళన విరమించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు 80మందిని అరెస్టు చేశారు. మూడు వేల మంది పోలీసులను మోహరించారు. బ్యాంకాక్ పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమో క్రాసీకి చెందిన కార్యకర్తలు ప్రభుత్వ టెలివిజన్ ఎన్.బి.టి కేంద్ర కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీలక రహదారులను అహీనంలోకి తెచ్చుకున్నారు. ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థకు గండి కొట్టారు. అంతకుముందు గవర్నమెంట్ హౌస్ వరుకూ భారీ ర్యాలీ నిర్వహించాలని పథకం వేసుకున్నారు. సమక్ 2006లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని టక్సిన్ షిన వత్రాకు అక్రమ ప్రతినిధిగా మారి పాలన కొనసాగిస్తున్నారని ప్యాడ్ నేతలు ధ్వజమెత్తారు. |