|
Page 1 of 2 ప్రజారాజ్యం పార్టీని ఆవిష్కరిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన సుధీర్ఘ ప్రసంగానికి లక్షలాది మంది అభిమానులు హాజరైన అతి భారీ సభలో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల ముందు ఆసక్తిగా చూస్తున్న సన్నివేశంలో ఘన నేతగా అవతరించారు. కానీ పార్టీ ఆవిర్భవించే అత్యద్భుత అవకాశాన్ని చిరంజీవి పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. తిరుపతిలోని అవిలాల చెరువు వేదికపై నుండి చిరంజీవి చేసిన ప్రసంగాన్ని ఆసాంతం వీక్షించిన వారంతా...
బాగుంది అన్న వ్యాఖ్య తప్ప 'అద్భుతం', 'మెగాహిట్' అనే వ్యాఖ్యలు వినిపించలేదు. మార్పు కోసం రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించిన మెగాస్టార్ సినీ నటుడు పాత్ర నుంచి ఒక రాజకీయ నాయకుడి పాత్రలోకి మారడంలో కాస్త ఇబ్బందిపడ్డట్లు కనిపించింది. ప్రజలను బాధిస్తున్న, వేధిస్తున్న సమకాలీన సమస్యలన్నిటిని తడమడంతోనే ఆయన సరిపెట్టారు. అనేకాంశాలను ప్రస్తావించిన ఆయన, ఏ ఒక్కదాన్ని తన ఎజెండాగా, ప్రత్యేకంగా, బలంగా చూపలేకపోయారు. తానెందుకు రాజకీయాల్లోకి వచ్చింది ఇప్పుడున్న ఇతర పార్టీల, నేతల కంటే భిన్నంగా తాను ఎలా చేయగలిగేది, నేటి వ్యవస్థ కన్నా వైవిధ్యమైన దాన్ని ఎలా ఆవిష్కరించేది వివరించలేకపోయారు. |