|
లంకలో తొలిసారి భారత్ సీరీస్ కైవసం |
|
|
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో వన్డేలో భారత్ సమిష్టి కృషితో శ్రీలంకపై నెగ్గి మరో వన్డే మిగిలి ఉండగానే లంకలో తొలిసారి సీరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓవర్లలో 258పరుగులు చేసింది. సెహ్వాగ్ గాయం కారణంగా జట్టులోకి...
వచ్చిన విరాట్ కోహ్లి తొలి హాఫ్ సెంచరి చేయగా, సురేష్ రైనా 78బంతుల్లో 76, కెప్టెన్ ధోని బాధ్యతాయుత బ్యాటింగ్‌తో 80బంతుల్లో 71 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో తుషారా ఒక్కడే రాణించి 5వికెట్లు తీశాడు. తరువాత 259పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి రంగంలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ జయసూర్య 52బంతుల్లో 60, తుషారా 29బంతుల్లో 40 పరుగులతో ధాటిగా ఆడి కాసేపు భారత్‌ను భయపెట్టగలిగారే గాని లక్ష్యాన్ని చేదించలేకపోయారు. ఫలితంగా శ్రీలంక 46.3ఓవర్లలో 212పరుగులకే ఆలౌటైంది. భారత్ 46పరుగుల తేడాతో భారత్ విజయభేరి మోగించింది. భారత బౌలర్లలో హర్భజన్ 3వికెట్లు, మునాఫ్ 2వికెట్లు, యువరాజ్ 2వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆసియా కప్ పరాజయానికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. |