|
ఆస్ట్రేలియాలో రెండు విమానాలు ఢీ |
|
|
పైలెట్ శిక్షణలో భాగంగా తాను నడుపుతున్న విమానం గాల్లోనే మరో విమానాన్ని ఢీ కొనడంతో భారత్‌కు చెందిన ఆకాశ్ అనంత(24) అనే ట్రైనీ పైలెట్ చనిపోయాడు. ఆకాశ్ నడుపుతున్న సెన్ని 150విమానం మరో విమానాన్ని ఢీకొట్టి మెల్‌బోర్న్‌లోని చెల్టన్ హమ్...
ప్రాంతంలోని ఓ కారు షెడ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక విమానం మరో విమానం తోక భాగాన్ని కత్తిరించిందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఓ ప్రైమరీ స్కూలు, ఓ నివాస ప్రాంతం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. మరి విమానంలో పైలెట్‌కు తోడుగా భారత్‌కు చెందిన ఇంకో ట్రైనీ పైలెట్ ఉన్నాడు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దగ్గరలోని మూరచ్చిన్ విమానాశ్రయంలో వారు ఆ విమానాన్ని సురక్షితంగా దించారు. |