|
డెమోక్రాట్ల అభ్యర్ధిగా బారక్ ఒబామా |
|
|
అమెరికా రాజకీయ చరిత్రలో ఒక నల్లజాతి వ్యక్తి అధ్యక్ష స్థానానికి పోటీ పడటం విశేషం. డెన్వార్లో జరుగుతున్న పార్టీ ప్రతినిధుల సమావేశాల్లో డెమోక్రాట్లు తమ పార్టీ అభ్యర్ధిగా బారక్ ఒబామాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని పార్టీ ఎన్నికల...
అధికారి నాన్సీ పెలోసి అధికారికంగా ప్రకటించారు. పార్టీ తరుపున అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసేందుకు సాధారణంగా ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్రాల వారీగా చేజిక్కించుకున్న ప్రతినిధులను లెక్కగట్టి, ఎవరికి ఎంతమంది మద్దతిస్తున్నది ఓటింగ్ పెడతారు. ఆ ఓటింగ్‌లో గెలిచిన వ్యక్తినే తమ పార్టీ అభ్యర్ధిగా ఎన్నుకుంటారు. కానీ హిల్లరీ అభ్యర్ధిత్వానికి ఇప్పటికే ప్రతినిధుల నుంచి గట్టి మద్దతు ఉన్నప్పటికీ ఆమె తోసి పుచ్చారు. సర్వ సాధారణంగా అనుసరించే నియమనిబంధలను అన్నింటిని పక్కన పెట్టి ఒబామాను మూజువాని ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకుందామని స్వయంగా హిల్లరీ క్లింటన్ చేసిన ప్రతిపాదనని ప్రతినిధులందరూ హర్శాతిరేకాల మధ్య అంగీకారం తెలిపారు. బిల్ క్లింటన్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒబామా అభ్యర్ధిత్వాన్ని గట్టిగా సమర్ధించారు. ఉపాధ్యక్ష పదవికి జోసెఫ్ బైడన్ అభ్యర్ధిత్వానికి కూడా క్లింటన్ దంపతులు తమ అంగీకారం తెలియచేశారు. |