|
అమెరికాకు ధీటుగా రష్యా క్షిపణి |
|
|
అమెరికాకు ధీటుగా రష్యా భారీ క్షిపణి ప్రయోగం చేసింది. ప్లెసెత్స్క్ అంతరిక్ష కేంద్రం నుండి అణు సామర్ధ్యం గల తోపోల్ ఆర్ఎస్-12ఎం క్షిపణిని ప్రయోగాత్మకంగా ప్రయోగించింది. 45 టన్నుల బరువు గల తోపోల్ ఆర్ఎస్-12ఎం క్షిపణి 3700 మైళ్ళ దూరంలోని లక్ష్యాలను...
సునాయాసంగా ఛేదించగలదు. అమెరికా పోలండ్‌లోనిర్మించతలపెట్టిన క్షిపణి నిరోధక వ్యవస్థను సైతం ఈ క్షిపణి ఛేదించగలదు. ఇరాన్, ఉత్తరకొరియాలను ఎదుర్కొనేందుకు పోలండ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా చెప్పుతున్నా, ఇది తమ భద్రతకు ముప్పని రష్యా ఆరోపించింది. దానిని అధిగమించడానికే రష్యా తోపోల్ ఆర్ఎస్-12ఎం క్షిపణి ప్రయోగం చేసినట్లుగా తెలుస్తోంది. |