|
ఒక వ్యక్తికి 86మంది భార్యలు |
|
|
నైజీరియాకు చెందిన మహ్మద్ బెల్లో ముసాబా అనే 84ఏళ్ల వృద్ధుడు మొత్తం 86మందిని వివాహం చేసుకున్నాడు. ఇంతమందిని కట్టుకోవడం ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం వ్యతిరేకం కాబట్టి నైజీరియాలోని ఇస్లామిక్ పెద్దలంతా మతోల్లంఘనకు మరణమే శిక్ష అంటూ...
ఓ నోటిస్ ఇచ్చారు. ఆ నోటీసుకి ముసాబా స్పందిస్తూ నా భార్యల్లో ఓ ఒక్కరికీ వదులుకునేది లేదని, 30సంవత్సరాలుగా వారు నాతో కాపురం చేస్తున్నారని, వారికి పిల్లలున్నారని వారందరిని రెండు రోజుల్లో వదిలేయడం కష్టమని దబాయిస్తూ వస్తున్న ముసాబా ఇస్లామిక్ పెద్దల ఒత్తిడి మేరకు మెత్తబడ్డాడు. ఇస్లామిక్ సంప్రదాయ ఖురాన్ అనుమతించిన మేరకు నలుగురు భార్యలతో మాత్రమే కాపురం చేస్తామని, మిగిలిన 82మందికి విడాకులు ఇస్తానని ముసాబా స్పష్టం చేశాడు. |