www.eenaduandhra.com - పొగ త్రాగే వారి జేబులు ఖాళీ

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
పొగ త్రాగే వారి జేబులు ఖాళీ Print E-mail
Smokingబహిరంగంగా దమ్ము కొడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టే వారిపై ఇకపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి వారిపై జరిమానా విధించే అదికారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, రైల్వే స్టేషన్ మాస్టర్లు, పోస్ట్‌మెన్ లకు కల్పిస్తుంది.
 
మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబర్ 2నుండి ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని ఆరోగ్య శాఖ కృత నిశ్చయంతో ఉంది.
 
బహిరంగ ప్రదేశాలతో పాటు అన్ని కార్యాలయ భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, బాస్ స్టేషన్లు, హోటళ్లు, రెస్టారెంట్లును కూడా ఈ జాబితాలో చేర్చారు. వీటి ప్రాంగణంలో ఎక్కడా పొగ పీల్చడానికి లేదు. పొగ తాగుతూ చిక్కిన వారు దగ్గరి నుంచి రూ. 200జరిమానా విధిస్తారు. రూ.200 జరిమానా చాలా తక్కువని ఈ మొత్తాన్ని రూ. 2వేల వరుకూ పెంచాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.