www.eenaduandhra.com - అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్: సైమండ్స్

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్: సైమండ్స్ Print E-mail
Symondsబంగ్లాదేశ్‌తో వన్డే సీరీస్ ఆరంభానికి మూడు ముఖ్యమైన జట్టు సమావేశానికి హాజరుకాకుండా చేపలు వేటకు వెళ్ళిన సైమండ్స్ క్రికెట్ ఆస్ట్రేలియా నుండి సీరీస్ బహిష్కారానికి గురయ్యాడు. గతంలో కూడా సైమండ్స్ 2005యాషెస్ సీరీస్ సందర్భంగా తప్పతాగి...
 
సైమండ్స్ రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని అనుభవించాడు. వెస్టిండీస్ పర్యటనలో బాగా నిద్రపోయి టీమ్ బాస్ మిస్ కావడంతో 3వేల డాలర్లు జరిమానా కట్టాడు. గత వేసవిలో భారత్ పర్యటనలో భజ్జీతో కయ్యం పెట్టుకుని సైమండ్స్ రగడ సృష్టించిన విషయం తెలిసిందే.
 
కానీ ఈ సారి సైమండ్స్ బహిష్కరించడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లుగా  ఉన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తన బహిష్కార విషయాన్ని ఆలోచించాలని లేకపోతే తాను భారత్‌లో జరగబోయే పర్యటనకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని క్రికెట్ బోర్డును బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకు ఆస్ట్రేలియా క్రికెట్ తలొగ్గతుందా? లేదా? అనే విషయాన్ని మనం త్వరలో చూడబోతున్నాం!