www.eenaduandhra.com - ఒకే కాలేయంతో ఇద్దరు రోగులకు ఉపశమనం

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
ఒకే కాలేయంతో ఇద్దరు రోగులకు ఉపశమనం Print E-mail
దేశంలో తొలిసారిగా ఇన్ సిటు కాలేయ మార్పిడి దృష్ట్యా చికిత్స ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ ఆసుపత్రిలో జరిగింది. దీని వల్ల తీవ్ర స్థాయి కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు రోగుల ఉపశమనం లభించింది. సైన్యంలో మేజరుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి భార్య...
 
గత నెల 27న ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రిలో చేరింది. ఎంత చికిత్స చేసినా ఆమె కోలుకోలేకపోవడంతో వైద్యులు ఆమెను "బ్రెయిన్ డెడ్"గా ప్రకటించారు. దీనితో ఆమె తన అవయవాలను దానం చేయాలన్న కోరికను భర్త మన్నించడంతో ఇన్ సీటు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు.
 
ఈ విధానంలో దాత కాలేయాన్ని రెండు భాగాలుగా చేసి, ఇద్దరు రోగులకు అమర్చుతారు. ఫలితంగా ఇద్దరికి ప్రయోజనం కలిగింది. ఈ కేసులో కాలేయంలో చిన్న భాగాన్ని బిల్లరీ ఆట్రసెస్ అనే వ్యాధితో బాధపడుతున్న 14నెలల చిన్నారికి మార్పిడి చేశారు. పెద్దభాగాన్ని క్రిప్టోజెనిక్ సైరోసిన్ అనే వ్యాధితో బాధపడుతున్న 26ఏళ్ల సైనికుడికి అమర్చారు. ఈ శస్త్ర చికిత్స 18గంటల పారు సాగిందని డాక్టర్లు వివరించారు.