www.eenaduandhra.com - చంద్రబాబు వారసుడొచ్చాడు

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
చంద్రబాబు వారసుడొచ్చాడు Print E-mail
Article Index
చంద్రబాబు వారసుడొచ్చాడు
Page 2
Page 3
Nara Chandrababu Naiduఎట్టకేలకు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు రాజకీయ వారసుడొచ్చారు. ఆయన తనయుడు నారా లోకేష్ తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. ఆగష్టు 15 శుక్రవారం గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో లోకేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
 
ఇప్పటివరకూ మిత్రులతో క్రికెట్ ఆడుతూ, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న లోకేష్ ఇకపై రాజకీయాల్లోనూ కాలుమోపనున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. చంద్రబాబు నగరంలో లేనప్పుడు సహజంగా హరికృష్ణ పార్టీ కార్యక్రమాలకు సారధ్యం వహిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం బాబు తనయుడు రంగంలోకి దిగడం చర్చనీయాంశమయింది. కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించేందుకు నందమూరి నటవారసులు రాజకీయ తెరపై కి సిద్ధమవుతున్న నేపథ్యంలో లోకేష్ రాక అదనపు బలం కానుంది.