
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధినేత్రి, యూపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లను ఎఐసిసి కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల పర్యవేక్షకుడు ఇక్బాల్‌సింగ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సమీక్షించారు.
కడప, చిత్తూరు, అనంతపూర్ జిల్లాల పర్యటనకు సోనియా ఈ నెల 11న రాష్ట్రానికి రానున్నారు. 11వ తేదీ ఉదయం 8 గంటలకు డిల్లీ నుంచి బయలు దేరి 9.45కి తిరుపతి చేరుకుంటారు. అక్కడ ఎయిర్ పోర్టులో స్వయం సహాయ సంఘాల సభ్యులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.30కి కడపజిల్లా ఇడుపాయలకు చేరుకున అక్కడ ఐఐఐటిని, రాజీవ్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి అంతపురం వెళ్ళి బహిరంగ సభలో పాల్గొని బెంగుళూరు మీదుగా డిల్లీకి వెళ్ళనున్నారు. సోనియా పర్యటన ఏర్పాట్లను ఇక్బాల్‌సింగ్ శుక్రవారం పిసిసి అధ్యక్షుడు, పిసిసి కార్యవర్గం, సిఎంతో చర్చించారు. సోనియా రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో పిసిసి నేతలతో చర్చించిన ఇక్బాల్‌సింగ్ మధ్యాహ్నం అసెంబ్లీలో సిఎంను కలిసి కాసేపు చర్చించారు.