
రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానంలో యుఎన్‌పిఏ నుంచి బయటపడి కాంగ్రెస్‌కు మద్దతు పలికిన సమాజ్‌వాదీ పార్టీ తాజాగా ఒక విచిత్ర నిర్ణయం తీసుకుంది. యుపిఏ సర్కారు నియమించిన కమిటీలో సభ్యత్వం ఉన్న సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర స్థాయిలో మాత్రం చిరంజీవి ప్రజారాజ్యంతో జత కట్టేందుకు సిద్ధమవుతోంది.
రెండునెలల క్రితం సినీ నటి, ఎంపి జయప్రద శ్రీకాకళహ స్తి దేవాలయానికి వచ్చిన సందర్భంగా, తాము వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చిరంజీవి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే త్వరలో జయప్రద తన మాటలను చేతల్లో చూపించనున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమర్‌సింగ్ వ్యాఖ్యలు పరిశీలిస్తే, వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాదీ ప్రజారాజ్యంతో కలసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఎస్‌పికి పెద్దగా బలం లేకపోయినా, తెలుగుదేశం పార్టీని అడ్డుకోవడానికి పనికివస్తుందన్న అంచనాలో చిరు శిబిరం కూడా ఉంది. ముఖ్యంగా అమితాబ్, జయప్రద వంటి అగ్రతారలు ప్రచారానికి వస్తే తమకూ అనుకూలమేనంటున్నారు.
మీ అభిప్రాయాలను తెలియచేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి
You can directly mail your feedback to
This e-mail address is being protected from spam bots, you need JavaScript enabled to view it