|
తెలంగాణ ప్రజలను ఐక్యమత్యం చేస్తా:గౌడ్ |
|
|
తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయటానికే తెలంగాణ ఆత్మగౌరవయాత్ర ప్రారంభించామని నవ తెలంగాణ ప్రజాపార్టీ అధినేత దేవేంధర్‌గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ లో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రక్రియలు చేస్తూనే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉధ్రుతం చేస్తామని చెప్పారు. ఆంధ్ర పాలకులు తెలంగాణను ఎలా దోచుకుతిన్నారో తెలుపుతూ ఎంత నిర్లక్ష్యం చేశారో తెలంగాణ ప్రజలకు వివరిస్తామన్నారు. ఎన్నికల గురించి పొత్తులజిత్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేవలం తెలంగాణ ప్రజలను ఐక్యమత్యం చేస్తూ వారిని చైతన్యవంతం చేస్తామని తెలిపారు. నిజాంసాగర్‌పై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నీటిని హైదరబాద్‌కు తరలిస్తూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు అన్యాయం చేస్తూన్నారని చెప్పారు. |