|
స్పీకర్‌కు మద్దతుగా పోరాటం:కిరణ్‌కుమార్ రెడ్డి |
|
|
|
టిడిపి, టిఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ సురేష్‌రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ దరిమిలా కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు మద్దతుగా పోరాటం సాగిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతం సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అభాసుపాలైన టిడిపి,
ఇప్పుడు సబ్‌స్టాన్స్ మోషన్ ద్వారా స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ద్వారా మరో సారి అభాసుపాలు కావద్దని ఆయన హితవు పలికారు. ఈ సబ్‌స్టాన్స్ మోషన్‌లో సంఖ్యాబలంగా తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం తమకుందని, ఈ చర్య ద్వారా సభలో మెజారిటీ లేని టిడిపి, టిఆర్ఎస్ ప్రజల్లో అభాసు పాలు కావడం ఖాయమన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చిన్న వయస్సులో స్పీకర్‌గా ఎన్నికై, ఆ స్థానానికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చి మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన స్పీకర్‌పై ఆరోపణలు, విమర్శలు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం బాధకలిగేంచే విషయమన్నారు. తెలంగాణ ప్రాంత వ్యక్తి, సిఎంతో సమానంగా ఉన్నత స్థానంలో ఉన్నవ్యక్తి అని కూడా గౌరవించకుండా టిఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. |