www.eenaduandhra.com - అవినీతి పరులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటాం:గౌడ్

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
అవినీతి పరులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటాం:గౌడ్ Print E-mail

Imageఓట్లు, సీట్ల ద్వారా తెలంగాణ రావడం అనేది భ్రమ మాత్రమేనని, తెలంగాణ సాధనకు ఉద్యమమే ఏకైక మార్గమని నవ తెలంగాణ ప్రజాపార్టీ అధినేత తూళ్ల దేవేందర్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చీకటి పొత్తులను పెట్టుకుని తెలంగాణకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.

తెలంగాణ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఆయన నిర్మల్ పట్టణంలో రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ తెస్తామంటు ఎన్నికైన టిఆర్ఎస్ పార్టీ సగం మంది ఎమ్మెల్యేలు వైఎస్ రాజశేఖర్ చుట్టూ ఈగల్లా తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. రానున్న రోజుల్లో మేధావులు, నిజాయితి పరులు రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. అవినీతి పరులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తలాపున గోదావరి ప్రవహిస్తున్న, ప్రక్కనే పోచాంపాడ్ ప్రాజెక్ట్ ఉన్న నిర్మల్ ప్రాంతవాసులు త్రాగు, సాగునీటికై అలమటిస్తున్నారని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. అయితే నీటిని మనకు కాకుండా ఆంధ్రకు తరలిస్తున్న పాలకులను రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలను దష్టిలో పెట్టుకుని వైఎస్ రూ. 2కిలో బియ్యం ఇస్తుంటే, చంద్రబాబు మరో అడుగు ముందుకేసి ఉచితంగానే ఇస్తామంటూ చంద్రబాబు, వైఎస్‌లు చీకటి పొత్తులను కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏది ఇచ్చిన, చేసిన వాళ్ల జాగీరు అమ్మి ఇవ్వడం లేదని మనది మనకే ఇస్తున్నారన్నది నగ్న సత్యమన్నారు.