www.eenaduandhra.com - 'మీకోసం' యాత్రలో పార్టీ ఇచ్చిన హామీల అమలు

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
'మీకోసం' యాత్రలో పార్టీ ఇచ్చిన హామీల అమలు Print E-mail
Imageఎన్నికలు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల సాధ్యాసాధ్యాలపై టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చర్చించింది. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్‌లో..

యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని కమిటీ సభ్యులు దాడివీరభద్రరావు,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులు తొలి సారిగా సమావేశమయ్యారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 'మీకోసం' యాత్రలో భాగంగా మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీసీ గర్జన, రైతు గర్జన, 'మీకోసం' యాత్ర, వివిధ సందర్భాల్లో పార్టీ ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా ఇందులో ఆర్థిక, విధాన పరమైన హామీల జాబితాలను వేరువేరుగా రూపొందిస్తున్నారు. 12గంటల పాటు ఉచిత విద్యుత్, ఉచిత బియ్యం, కులవృత్తులు, చేతివృత్తుల సంక్షేమానికి ఇచ్చిన హమీల అమలుపై సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక సంపద పెరిగిన నేపథ్యంలో పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయవచ్చని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.