www.eenaduandhra.com - శ్రీజ, శిరీష్ చేసిన నేరమేమిటి? :డి.సి రోశయ్య

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
శ్రీజ, శిరీష్ చేసిన నేరమేమిటి? :డి.సి రోశయ్య Print E-mail
Image'కులాంతర వివాహం చేసుకున్న వారిని ఆశీర్వదించే నైతిక అర్హత చిరంజీవికి లేదు. తన సొంత కూతురు ప్రేమ వివాహాన్నే స్వాగతించని వ్యక్తి, ఇతరుల ప్రేమ వివాహాన్ని అభినందించే నైతిక అర్హత ఉందా? శ్రీజ, శిరీష్ చేసిన నేరమేమిటి? కత్తి పద్మారావు కుమారుడి కులాంతర వివాహాన్ని నేను అభినందిస్తున్నా.

కానీ, జంటను ఆశీర్వదించడానికి చిరంజీవి అనర్హుడు. ముందు సొంత కూతురికి న్యాయం చేయమనండి. తన చుట్టూ సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే వాళ్లని పెట్టుకుని సామాజిక న్యాయం చేస్తామంటే నమ్మేదెవరు. మిత్రా, పరకాల, ఆంజనేయరెడ్డి, అల్లు అరవిందు వంటి వాళ్లతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందా? వైఎస్‌కు ఉన్న క్షమాగుణం ఆయనకు లేద'ని చిరంజీవి రాజకీయాల్లోకి రావాలంటూ పాదయాత్రలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి డిసి రోశయ్య ధ్వజమెత్తారు. చిరు కోసం పాదయాత్రలు చేసినందుకు త్వరలో ప్రాయశ్చిత్త యాత్రలు మొదలుపెడతానని వెల్లడించారు. చిరంజీవి చుట్టూ అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు లేరనడానికి ఇటీవల సిపిఎంతో మిత్రా జరిపిన మంతనాలే నిదర్శనమన్నారు. చిరు రాజకీయాల్లోకి రావాలంటూ ప్రారంభంలో ఉద్యమాలు చేసిన సాయి సుధాకర్, టివి రావు వంటి నాయకులు ఇప్పడు కనిపించకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. పార్టీలో తనను అడ్డుకోవడానికి తాను చేసిన నేరమేమిటో చిరునే చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ తన తండ్రిని చంపిన వారిని క్షమించి వదిలేస్తే, చిరు తన సొంత కూతురు అభిప్రాయాలను క్షమించలేకపోయారన్నారు.