|
ధర్మానకు దువ్వాడ శ్రీనివాస్ సవాల్ |
|
|
|
Page 1 of 2 రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు దమ్ముంటే వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై పోటీ చేసి గెలవాలని శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా వైస్ ఛైర్మన్ దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విసిరారు. కాంగ్రెస్, టీడీపీల అండర్ స్టాండింగ్ రాజకీయాల వల్ల జిల్లా అభివృద్దికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నాటి తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాను ధర్నాలు, ర్యాలీలు చేసి జిల్లాలో పార్టీ అభివృద్దికి కృషి చేశానన్నారు. కానీ పార్టీల్లో పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం వుందని ఆరోపించారు. తాను పార్టీకే ప్రాధాన్యం ఇచ్చాను కాని వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ లబ్దిపొందుతున్న ధర్మానలాంటి వారి అరాచకాలు ఎక్కువ కావడంతో ఆ పార్టీకి రాజీనామా చేయాల్సివ చ్చిందని తెలిపారు. మంత్రి హోదాలో వుంటూ కబ్జాలకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న ధర్మానకు చిరంజీవిని విమర్శించే హక్కు లేదన్నారు.
|