|
మూడో టెస్ట్‌లో కుంబ్లే చేతికి గాయం |
|
|
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు కెప్టెన్...
అనిల్ కుంబ్లే గాయపడడంతో మైదానం నుంచి నిష్క్రమించాడు. కుంబ్లే నిష్క్రమణతో మూడో రోజు చివరివరకు వైస్ కెప్టెన్ ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ టెస్ట్‌లో మూడో రోజు ఆట సందర్భంగా మిశ్రా బౌలింగ్‌లో మాథ్యూ హెడెన్ కొట్టిన బంతిని అందుకునేందుకు షార్ట్ మిడ్‌వికెట్‌లో ఉన్న కుంబ్లే గాలిలో ఎగిరాడు. దీంతో అదుపు తప్పి నేలమీద పడిన కుంబ్లే ఎడమ చేతి చిటికెన వేలికి గాయమైంది. దీంతో నాలుగోరోజు కుంబ్లే మైదానంలోకి రావడం అనుమానమనే వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను వమ్ము చేస్తూ నాలుగోరోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కుంబ్లే బరిలో దిగి అందరినీ ఆశర్యపరిచాడు.
|