డెమొక్రటిక్ అభ్యర్థి బారెక్ ఒబామా తన రిపబ్లికన్ ప్రత్యర్థి జాన్‌మెక్‌కెయిన్‌పై భారీస్థాయిలో విజయాన్ని సాధించి, అమెరికా...
సంయుక్తరాష్ట్రాలకు అధ్యక్షుడైన తొలి నల్లజాతివ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మునుపెన్నడూ లేనిరీతిలో సుమారు రెండేళ్ళపాటు సాగిన ఎన్నికల ప్రచారం అనంతరం కెన్యా తండ్రికి, తెల్లజాతి అమెరికన్ తల్లికి జన్మించిన నలభయ్యేడేళ్ళ ఇల్లినోయిస్ సెనేటర్ ఒబామా 338 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించగా, ఆయన ప్రత్యర్థి మెక్‌కెయిన్‌కు 155 ఓట్లు దక్కినట్టు సిఎన్ఎన్ తెలిపింది. తన ఓటమిని డెబ్భైరెండేళ్ళ మెక్‌కెయిన్ అంగీకరిస్తూ, ఒబామాకు తనతోపాటు అభినందనలు తెలుపాల్సిందిగా అమెరికన్లందరినీ కోరారు. ఒబామాకు మంచి పేరుందని చెబుతూ 'ప్రమాదకరంగా మారిన ప్రపంచంలో' దేశ భద్రతను కాపాడేందుకు అన్ని విభేదాలనూ తొలగించేందుకు అవసరమైన ధోరణులను ఒబామా అనుసరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికా 44వ అధ్యక్షునిగా వచ్చేఏడాది జనవరి 20వతేదీన ఎనిమిదేళ్ళపాటు పాలించిన రిపబ్లికన్ జార్జి డబ్ల్యు.బుష్ స్థానంలో ప్రమాణస్వీకారం చేస్తారు. మార్టిన్ లూధర్‌కింగ్ సాగించిన మానవహక్కుల ఉద్యమానికి 45 సంవత్సరాల అనంతరం అమెరికన్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. |