|
నాగపూర్ టెస్టులో తొలిరోజు భారత్ స్కోరు 311/5 |
|
|
నాగపూర్‌లో ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సచిన్ తన కెరీర్‌లో 40వ సెంచరీ పూర్తి చే సుకున్నాడు. 166 బంతుల్లో...
11 బౌండరీలతో విజృంభించి ఆడిన సచిన్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆట ముగిసే సమ యానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మన్స్‌లో సచిన్ (109) సెంచరీ చేయగా, సెహ్వాగ్ (66), లక్ష్మణ్ (64) హాఫ్ సెంచరీలతో అభిమానులను అలరించా రు. ఆసీస్ బౌలర్లలో జెజె. క్రెజ్ మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఆదిలో వన్డే తరహాలో ఆడింది. ఈ క్రమంలోనే కొత్త కు ర్రాడు రమేష్(33), సెహ్వాగ్ ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ద్రవిడ్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక లక్ష్మణ్, సచిన్ చెలరేగి స్కోరు బోర్డును గాడిలో పెట్టారు. ప్రస్తుతం గంగూలీ (27), ధోని (4) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. |