షాంఘైలో జరిగిన మాస్టర్స్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత్‌కు చెందిన టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, బహామాస్‌కు చెందిన...
మార్క్ నోవెల్స్ జోడీ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన వెస్లే మూడీ, జెఫ్ కొయెట్జీ జోడీపై 6-2, 6-3 తేడాతో భూపతి జోడీ విజయం సాధించింది.
మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ రెడ్ గ్రూప్‌కు చెందిన ఐదో సీడ్ జోడీతో సుమారు 63 నిమిషాలు పాటు పోరాడింది. దక్షిణాఫ్రికా జంట గట్టిగా పోరాడినప్పటికీ, భూపతి జోడీ దూకుడు ముందు వారి పోరాటం వెలవెలపోయింది. |