|
విశ్వ శాంతి యజ్ఞాన్ని ఆరంభించిన సత్యసాయిబాబా |
|
|
విశ్వశాంతికోసం చేపట్టిన సహస్ర చంద్ర మహాదర్శన యజ్ఞకార్యక్రమాన్ని భగవాన్ శ్రీసత్యసాయిబాబా, వందలాది మంది...
వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞాన్ని ఆరంభిం చారు. శ్రీసత్యసాయిబాబా 83వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన విశ్వశాంతి మహాయజ్ఞం పుట్టపర్తిలోని స్టేడియంలో మూడు రోజుల పాటు జరుగుతుంది. బాబా స్టేడియంలోకి అడుగిడగానే వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాబా యజ్ఞహోమ గుండాలను క్షుణ్ణంగా పరిశీలించి వేదపండితులకు యజ్ఞసామగ్రిని అందిస్తూ యజ్ఞాన్ని ప్రారంభించమని బాబా అనుమతి ఇవ్వడంతో వేదపండితులు వేద ఘోషతో యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞం జరుగుతున్న సందర్భంగా వేదపండితులు, విద్యార్థులు వేదమంత్రాల ఘోషమధ్య బాబా భక్తులకు ప్రత్యేక ఆశీసులు అందచేశారు. యజ్ఞాన్ని అతి దగ్గరలో తిలకించడానికి ప్రత్యేకంగా రెండు ఎల్రక్టానిక్ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. మూడురోజుల పాటు జరిగే ఈ యజ్ఞంలో పాల్గొనడానికి 225 దేశాల నుంచి సత్యసాయి భక్తులు, ప్రముఖులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
|