|
అమెరికాలో తెలుగు విద్యార్ధిపై కాల్పులు |
|
|
అమెరికాలో తెలుగు విద్యార్ధిపై దుండగులు కాల్పులు జరిపారు. వరంగల్ జిల్లాకు చెందిన శశాంక్ అనే విద్యార్ధిపై...
గుర్తుతెలియని ఆఫ్రికన్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో శశాంక్‌కు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శశాంక్‌ను నేచురల్లీ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తున్నది. అతని పరిస్దితి ఆందోళనకరంగా ఉన్నట్లు తమకు సమాచారమందిందని బంధువులు తెలిపారు. సంఘటన తెలిసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఉన్నత విద్య కోసం రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన శశాంత్ ఇద్దరు మిత్రులతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గత సంవత్సరం నుండి అమెరికాలో 6గురు తెలుగు విద్యార్థులు దుండగుల అఘాయిత్యాలకు బలైపోయారు.
|