www.eenaduandhra.com - పురాతన దేవాలయలాభివృద్దికి 150 కోట్లు

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
English news
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

పురాతన దేవాలయలాభివృద్దికి 150 కోట్లు Print E-mail
Imageపురాతన దేవాలయాలను 150 కోట్ల రూపాయలతో అభివృద్దిచేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి అంబికాసోనీ వెల్లడించారు...
 
ఇందుకోసం మూడు మెగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె చెప్పారు. ఈ మొత్తం నిధులను హైదరాబాద్, కడప, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలఅభివృద్దికి వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 46.5 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరో 17 పురాతన దేవాలయాలను గుర్తించామని, వీటిని కూడా అభివృద్ది పరచడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
 
దేవాలయాలకు వచ్చిన భక్తులు, యాత్రికులు ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ ధ్యేమని, అందులో భాగంగానే పురాతన ఆలయాల అభివృద్దికి అధికంగా నిధులను కేటాయిస్తున్నామని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాకుండా పురాతన దేవాలయాలను భవిష్యత్ తరాలకు చూపించడం పర్యటకశాఖ ప్రథమ కర్తవ్యమన్నారు.

 

ప్రత్యేకం

సినిమా వార్తలు!

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment