అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ రాసినట్టుగా భావిస్తున్న ఓ అరుదైన లేఖ ఇటీవల బయట పడింది. టెక్సాస్ లోని...
మ్యూజియంలో దీన్ని గుర్తించారు. అమెరికా సివిల్ వార్ లో అయిదుగురు కొడుకులనూ కోల్పోయిన లిడియా బేక్స్ బై అనే మహిళను ఉద్దేశించి లింకన్ ఈ లేఖ రాశారు. దీని అదారంగా నే 1998 లో ఆస్కార్ అవార్డు సాధించిన 'సేవింగ్ ది ప్రైవేట్ ర్యాన్' చిత్రం నిర్మితమైంది. డల్లాస్ హిస్టారికాల్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ కలెక్షన్స్ గత ఏడాది ఈ లేఖను ఓ ఫైల్లో గుర్తించారు. ప్రస్తుతం దీన్ని సుప్రసిద్ద వేలం సంస్థ క్రిస్టీస్ కు చెందిన నిపుణులు పరిశీలిస్తున్నారు. |