ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు నమ్మి ఆరి. టి. సి. కార్మికులు కాంగ్రెస్ పార్టికి ఆ ఎన్నికలలో ఓటును వేయటం...
జరిగింది. వారు చేసిన పనికి వారు నిండా మోసపోయారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారయింది వారి పరిస్తితి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చంద్ర బాబు నాయుడు ఆర్. టి. సి. ప్రైవేటు పరం చేస్తున్నాడు. వారికి అమ్ముతున్నాడు. వీరికి అమ్ముతున్నాడు. అని మోసపూరిత ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇపుడు తమ పార్టీ కార్యకర్తలకు, ఆర్. టి. సి. పై అధికారుల బంధువులకు లబ్ధి చేకూరేటట్లు ఫైళ్ళు రెడీ అయిపోయాయి. 3 సంవత్సరాల క్రితం మజ్దూర్ యూనియన్ సభలో సెట్విన్ సర్వీసులకు అనుమతి ఇచ్చేది లేదని వాగ్దానము చేసి ఈనాడు అదే సెట్విన్ సర్వీసుల రూపంలో తమ కార్యకర్తలకు, వంద మాగాధులకు లబ్ది చేకూరుస్తున్నాయి. సాక్ష్యాత్తూ ఆర్. టి. సి. ఛైర్మన్ మా సంస్థ బ్రతికి బట్టకట్టదు అని చెప్పటం జరిగింది. ముఖ్యమంత్రిని కలిసి ఈ నిర్ణయం పునరాలోచించామని కొరినా ఏ ఉపయోగము లేదని చెప్పారు. ఇదే కాక సంస్థ లోని పై అధికారులు, మేనేజ్‌మెంటు స్టాఫ్ తమ సొంత లాభాల కోసం దాదాపు 500 కోట్లను తమ బంధువులకు కట్ట పెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. దాదాపు సంస్థ మనుగడ ప్రశ్నార్డకంగా మారింది. కార్మికుల భవిష్యత్తు డోలాయమానంలో పడింది. దీనికి పూర్తిగా ప్రభుత్వం భాద్యత వహించాలి. మాట తప్పిన ముఖ్యమంత్రిపై కార్మికులు సమ్మె అస్త్రాన్ని సంధించారు. యూనియన్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నైజం బయట పడిందని అన్నారు.
|