|
మెడికోల హాస్టల్ రూంలో ప్రేమోన్మాది వీరంగం |
|
|
వరంగల్‌లోని కాకతీయ మెడికళాశాలలోని లేడీస్ మెడికో హాస్టల్ రూంలోకి ప్రేమోన్మాది దూరి వీరంగం సృష్టించిన సంఘటనతో ....
ఒక్కసారిగా లేడీ మెడికోలు ఉల్కిపడ్డారు. దీనికి కారణమైన మెడికోను ఆ గదిలో బంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు వాచ్‌మెన్ గది తలుపులు తీస్తుండగానే పారిపోయాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన దాకూరి అశ్వినీ కుమార్ వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల (కెఎంసి)లో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతను కెఎంసిలోని న్యూమెన్స్ హాస్టల్ రూం నెంబర్ 15లో ఉంటున్నాడు. ఇతనిపై గత మార్చి 24న యాంటీ ర్యాగింగ్ కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న మెదక్‌కు చెందిన ఉజ్మా కెఎంసిలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే వీరిరువురు మూడేళ్ల నుండి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత మూడు వారాల నుండి ఉమెన్స్ హాస్టల్‌లోని ఉజ్మా గదిలోంచి మగ గొంతు వినిపించడాన్ని పక్క గదిలో ఉన్న అమ్మాయిలు గమనించారు. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటి లాగానే అశ్వినీకుమార్ అర్థరాత్రి దాటాక ఉజ్మ గదిలోకి ప్రవేశించాడు. ఇంతలో ఉజ్మ, అశ్వీనికుమార్‌ల మధ్య గొడవ జరుగడం, కొంత సేపటికి ఆ పక్క గదిలో ఉన్న లేడీ మెడికోలు నిద్రలోంచి మేల్కొని మగగొంతును మళ్లీ విన్నారు. ఆ గదిలో ఎవరో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే వెళ్లి గది బయటి తాళం వేసి బంధించారు. తమకు రక్షణలేదని ఎవరో అపరిచిత వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడుతున్నారని పేర్కొంటూ కెఎంసి హాస్టల్ వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపాల్ అక్కడికి చేరుకుని వాచ్‌మెన్‌తో తాళం తీయించారు. ఇంతలో అశ్విన్‌కుమార్ వారి కళ్లుగప్పి గోడ దూకి పారిపోయాడు. తొలుత గదిలోంచి తనకు ఉజ్మతో ప్రేమాయణం కొనసాగుతోందని, మరో మూడు నెలల్లో విదేశాలకు వెళ్లేందుకు సిద్దమయ్యానని చెబుతున్నారు. అర్థరాత్రి వేళ ఎవరైనా గదిలోకి దూరుతారా ? అని ప్రశ్నించారు. ఉదయం 8 గంటలకు తాను ఆ గదిలోకి వెళ్లినట్లు అశ్వీనికుమార్ చెబుతున్నారు. తాను ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. ఉమెన్స్ హాస్టల్‌లోని విద్యార్థుల అభ్యర్థన మేరకు, పలు విద్యార్థి సంఘాల డిమాండ్ నేపథ్యంలో అశ్వీనికుమార్‌ను కెఎంసి హాస్టల్ నుండి సస్పెండ్ చేశారు.
|