ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య...
బ్యానర్ల విషయమై ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ చిలికిచిలికి గాలి వానగా మారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి వాహనాల విధ్వంసానికి దారి తీసింది. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పులివెందుల పట్టణంలో రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో ప్రజారాజ్యం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ నాయకునికి స్వాగత దోరణాలు, బ్యానర్లు, జెండాలు కడుతుండగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అడ్డుచెప్పారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లు, జెండాలను కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసి వేస్తుండగా ఈ ఘర్షణ చోటు చేసుకొంది. ఇదిలా వుండగా ఆర్అండ్‌బి అతిధి గృహంలో విడిది చేస్తున్న శోభానాగిరెడ్డి, ఎన్‌వి ప్రసాద్, కోటగిరి విద్యాధరరావుల కార్లను పగులగొట్టారు. బ్యానర్లు, జెండాలు చించివేశారు. ఈ విషయం పట్టణంలో దావానంలా వ్యాపించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆర్అండ్‌బి అతిధి గృహానికి చేరుకొని వై.ఎస్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. వెంటనే డిసిఎంఎస్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్, కౌన్సిలర్ చవ్వా సుదర్శన్‌రెడ్డిలు తమ కార్యకర్తలను బయటికి పంపించివేశారు. చేసి ఎస్పీ, డిఎస్పీలు రక్షణ ఇస్తుండగా సిఐ, ఎస్ఐలు ఎలాంటి సహకారం అందివ్వలేదని కోటగిరి విధ్యాధరరావు ఆరోపించారు. శోభానాగిరెడ్డి కారు, నా కారు, ఎన్‌వి ప్రసాదు కారు, ఆటోలను ధ్వంసం చేస్తున్న పోలీసులు కళ్లారా చూస్తున్నారే గానీ వారిని నియంత్రించిన పాపాన పోలేదని, ఇదేమిరాజ్యం సిఎం సొంత పట్టణంలోనే ఇంత గూండాయిజమా, సిఎం అండదండలతోనే విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. |