మూడు రోజులుగా జరిగిన ప్ర.రా.పా. పార్టీ అధినేత చిరంజీవి పర్యటనకు జిల్లాలో అనూహ్య స్పందన లబించింది. ప్ర.రా.పా...
పార్టీ శ్రేణులలొనూ నూతనోత్సాహం నింపింది. గోరంట్లలో వర్షంతో పర్యటన మొదలైనా చిరంజీవికి జనం బ్రహ్మరథం పట్టారు. తాడిపత్రిలో కూడా వర్షం మధ్యనే ఆయన పర్యటన ముగిసింది. ఈ మూడు రోజుల పర్యటనలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన అనంత ప్రజల మధ్య ప్రసంగించారు. ప్రభుత్వ అవినీతిని విమర్శించిన ప్రతీసారి ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులుగా ఉన్న షింగనమల, గుంతకల్లు, తాడిపత్రి లలో చివరి రోజు యాత్ర సాగింది. చిరు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధుల పై విరిచుకు పడ్డారు. వారి వల్లనే ఆ ప్రాంత అభివృద్ది కుంటూ పడిందని, వాళ్ళ అవసరాల కోసమే ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు తప్ప ప్రజల ఇబ్బందులు వారికి అవసరం లేదని నిశితంగా విమర్శించారు. జిల్లాల్లో వేరు శెనగ రైతుల దుస్తితికి కాంగ్రెస్ ప్రతినిధులు, వారి ప్రభుత్వమే కారణమని, జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న వెనుక బడిన కులములు అయిన బోయి, కురుమా, చేనేత వర్గాల ను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనగదొక్కుతున్నాడో వివరించారు. మనల్ని మనమే పాలించుకోవాలి కానీ అణిగి మణిగి ఉండాల్సిన అవసరం లేదన్నారు. తాడి పత్రిలో మంత్రి. జె. సి. దివాకర్ రెడ్డి ని పరోక్షంగా ఆయన ఫాక్శనిజాన్ని ప్రస్తావించి తూర్పూర బట్టారు. తాడిపత్రి లో రోడ్ షో బాగా ప్రొద్దు పోయిన తర్వాత మొదలైన రోడ్‌లన్ని జన సద్రంతో నిండిపోయాయి. సాయంకాలం 5 గంటల నుండే జనం పడిగాపులు పడ్డారు. ఇంద్ర సినిమా నుంచి ఆయన డైలాగులు వినిపించి అనంతరం ఫాక్శనిజాన్ని ఎండగట్టారు. రాయలసీమ అధిపత్య పోరులో మధ్య తరగతి ప్రజలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్న విష్యాన్ని హృదయాలకు హత్తుకొనేలా వివరించారు. జనాలకు మేలు చేసే పథకాలకు వ్యతిరేకం కాదని, పథకాలలోని అవినీతి మీద వ్యతిరేకమని వివరించారు. ఈ మూడు రోజుల పర్యటనో ప్రజారాజ్యం పార్టీ సంబరాలలో మునిగి పోయింది. రాయలసీమ ప్రాంతంలో ఇంత స్పందన లభించడం వారికి చాలా ఆనందంగా ఉంది. ఇదే స్పందన మిగతా జిల్లాలో కూడా ఉంటుందని వారి పార్టీ నాయకులు వెల్లడించడం జరిగింది. |